సూపర్ హిట్ కాంబో మరోసారి !

సూపర్ హిట్ కాంబో మరోసారి !
X
ఇప్పుడు ‘పీకే’ పదకొండేళ్ళు పూర్తి చేసుకున్న తర్వాత, ఆమీర్ ఖాన్ – రాజ్‌కుమార్ హిరానీ మళ్లీ ఒక సినిమాకు రెడీ అవుతున్నారన్న సమాచారం ఆసక్తిగా మారింది.

2009 లో ఆమీర్ ఖాన్, రాజ్‌కుమార్ హిరానీ కాంబినేషన్ లో వచ్చిన ‘3 ఇడియట్స్’ ఇండియన్ సినిమా చరిత్రను మలుపు తిప్పిన చిత్రం. ఇది కేవలం బ్లాక్‌బస్టర్ మాత్రమే కాదు, ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ శైలికి పాఠశాలగా నిలిచింది. ఆ తర్వాత ఐదేళ్లకు అదే కాంబో ‘పీకే’ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్‌ను శాసించింది. ఇప్పుడు ‘పీకే’ పదకొండేళ్ళు పూర్తి చేసుకున్న తర్వాత, ఆమీర్ ఖాన్ – రాజ్‌కుమార్ హిరానీ మళ్లీ ఒక సినిమాకు రెడీ అవుతున్నారన్న సమాచారం ఆసక్తిగా మారింది.

ప్రస్తుతం దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ మూడు ఐడియాలతో ఆలోచిస్తున్నారు. వాటిలో ఒకదాన్ని ఫైనల్ చేసి, ఆ కథను ఆమీర్‌కు వివరించారు. ఆమీర్ ఖాన్‌కు కూడా ఆ కథ బాగా నచ్చింది. 2026లో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. షారుఖ్ ఖాన్ ‘డంకీ’ తర్వాత.. ఇది హిరానీ దర్శకత్వంలో వచ్చే తదుపరి చిత్రం అవుతుంది. అంతేకాక, ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం పూర్తి స్థాయిలో చర్చల్లో ఉందని, ‘సితారే జమీన్ పర్’ విడుదల తర్వాత పనులు వేగంగా ముందుకు సాగుతాయని అదే వర్గం తెలిపింది.

ఇది ఓ స్లైస్ ఆఫ్ లైఫ్ కథ. హాస్యం, ప్రేరణ కలగలిపిన అంశాలతో ఉంటుంది. ఆ పాత్రలో నటనకు మంచి స్కోప్ ఉండటంతో ఆమీర్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. కథాంశం గురించి ఇంకా గోప్యత పాటిస్తున్నారు. సినిమా ఇప్పటికి ఒక ప్రాధాన్య ప్రాజెక్ట్‌గా నిలిచింది. సితారే జమీన్ పర్ విడుదల అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక హిరానీ సినిమా మొదలయ్యే ముందు, ఆమీర్ ఖాన్ మరో చిన్న ప్రాజెక్ట్ చేయగల అవకాశం ఉందట. కానీ ప్రస్తుతం ఆయన మొత్తం ఫోకస్ సితారే జమీన్ పర్ చిత్రంపై ఉంది. ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది.

Tags

Next Story