‘వార్ 2’ కోసం అదిరిపోయే ప్రోమోషనల్ స్ట్రాటజీ !

‘వార్ 2’ కోసం అదిరిపోయే ప్రోమోషనల్ స్ట్రాటజీ !
X
బాలీవుడ్ డైనమిక్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ల మొదటి స్క్రీన్ కలయికతో ఈ సినిమా భారీ హైప్‌ను సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆసక్తికరంగా.. ప్రమోషన్ క్యాంపెయిన్‌లో ఈ ఇద్దరు స్టార్లు కలిసి కనిపించరట.

మోస్ట్ అవైటింగ్ స్పై థ్రిల్లర్ ‘వార్ 2’ తో విడుదలకు సిద్ధమవుతోంది.. యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ. ఇంకా ఆరు వారాల్లో ఈ చిత్రం పెద్ద తెరపైకి రానుంది. బాలీవుడ్ డైనమిక్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ల మొదటి స్క్రీన్ కలయికతో ఈ సినిమా భారీ హైప్‌ను సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆసక్తికరంగా.. ప్రమోషన్ క్యాంపెయిన్‌లో ఈ ఇద్దరు స్టార్లు కలిసి కనిపించరట. బదులుగా, వారు విడివిడిగా సినిమాను ప్రమోట్ చేస్తారని టాక్. యశ్ రాజ్ ఫిల్మ్స్ వారి ప్రమోషనల్ స్ట్రాటజీలో ఇది ఒక భాగం.

తాజా సమాచారం ప్రకారం, హృతిక్, ఎన్టీఆర్‌ల స్క్రీన్‌పై జరిగే యాక్షన్ ‘ఢీ’ ని సర్‌ప్రైజ్‌గా ఉంచడానికి వైఆర్ఎఫ్ వారిని విడిగా ఉంచాలని ప్లాన్ చేసింది. “సినిమా విడుదలయ్యే వరకు వీళ్లిద్దరూ కలిసి ఒక్క ఈవెంట్, వీడియో లేదా పబ్లిక్ అప్పీరెన్స్‌లో కూడా కనిపించరు,” అని ఒక ట్రేడ్ ఇన్‌సైడర్ తెలిపారు. ఈ విధానం వారిద్దరి ఎపిక్ ఫేస్-ఆఫ్‌పై ఉత్కంఠను మరింత పెంచుతుందని మేకర్స్ భావిస్తున్నారు. వీరి ఇంటరాక్షన్ మొదటిసారి థియేటర్లలోనే ఆడియన్స్‌కు కనిపించనుంది. అదీ చాలా పెద్ద ఇంపాక్ట్‌తో.

‘వార్ 2’ 2019 బ్లాక్‌బస్టర్ వార్ కథను కొనసాగిస్తుంది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా.. ఇందులో టైగర్, పఠాన్ సినిమాలు కూడా ఉన్నాయి. వైఆర్ఎఫ్ అసాధారణ మార్కెటింగ్ విధానాలకు పేరుగాంచింది. ‘పఠాన్’ సినిమాకు లీడ్ యాక్టర్స్ ఎవరూ విడుదలకు ముందు మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, అయినప్పటికీ ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.

అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో, హృతిక్, ఎన్టీఆర్‌లతో పాటు కియారా అద్వానీ నటిస్తున్న ‘వార్ 2’ ఆగస్టు 14న, స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు విడుదల కానుంది. ఈ చిత్రం ఐమ్యాక్స్ లో కూడా అందుబాటులో ఉంటుంది. ఇది సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత రిచ్‌గా చేస్తుంది. వైఆర్ఎఫ్ ట్రాక్ రికార్డ్, ఈ ఆసక్తికర ప్రమోషనల్ స్ట్రాటజీతో ‘వార్ 2’ మూవీపై రానున్న వారాల్లో హైప్ మరింత పెరగడం ఖాయం.

Tags

Next Story