‘వార్ 2’ తో వార్ కు రెడీ అయిన కన్నడ సినిమా !

‘వార్ 2’ తో వార్ కు రెడీ అయిన కన్నడ సినిమా !
X
కన్నడ ప్యాన్ ఇండియా మూవీ ‘45’ మాత్రం ధైర్యంగా బరిలోకి దిగింది. శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సంక్రాంతి, ఉగాది తర్వాత ఈ ఏడాది బాక్సాఫీస్‌కు అత్యంత కీలకమైన సీజన్ ఇండిపెండెన్స్ డే. లాంగ్ వీకెండ్‌ను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో పలువురు నిర్మాతలు ఈ తేదీపై కన్నేశారు. ఈ పోటీలో ఇప్పటికే హృతిక్ రోషన్ , ఎన్టీఆర్ కలిసి నటించిన ‘వార్ 2’ ముందంజలో ఉంది. యష్ రాజ్ ఫిలిమ్స్ తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం... ఆగస్ట్ 14న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

ఇదిలా ఉండగా... రజనీకాంత్ ‘కూలీ’ చిత్రం మేకర్స్ ఈ పోటీ నుంచి తప్పుకోవాలా? లేక వేరే సరైన డేట్ చూసుకోవాలా? అనే సందిగ్ధంలో ఉన్నారు. అయితే... కన్నడ ప్యాన్ ఇండియా మూవీ ‘45’ మాత్రం ధైర్యంగా బరిలోకి దిగింది. శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం నిమిషం నిడివి గల వీడియోలోనే సినిమాపై ఆసక్తిని పెంచేలా ప్రెజెంటేషన్ ఉంది.

ఈ భారీ బడ్జెట్ ఫాంటసీ సైకాలజికల్ థ్రిల్లర్‌ను అర్జున్ జన్య స్వయంగా రచించి, దర్శకత్వం వహిస్తున్నారు. అంచనాలు కూడా అదే స్థాయిలో ఉండటంతో, ‘వార్ 2’ లాంటి మెగాప్రాజెక్ట్‌తో పోటీకి దిగేందుకు ‘45’ టీమ్ సిద్దమవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఇక ‘కూలీ’ రిలీజ్‌పై ఇంకా స్పష్టత లేదు. ఆగస్ట్ 15కి విడుదల చేయాలా? లేక ‘వార్ 2’ వాయిదా పడే అవకాశం కోసం ఎదురు చూడాలా? అనే అంశంపై సన్ పిక్చర్స్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అయితే, ‘45’ మూవీ మాత్రం ఎలాంటి ఊహాగానాలకు ఆస్కారం లేకుండా విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఈ పోటీ చివరకు ఎవరి సక్సెస్‌కు దారితీస్తుందో చూడాలి.

Tags

Next Story