రీరిలీజ్ లో అదరగొట్టిన బాలీవుడ్ మూవీస్ ఇవే!

డిజిటల్ మీడియా ఆధిపత్యం కొనసాగుతున్న ఈ రోజుల్లో, నడివయస్కులు, పెద్దవాళ్లను థియేటర్లకు రప్పించాలంటే కంటెంట్ పరంగా భిన్నమైన ప్రత్యేకత అవసరం. అలాంటిది ఒక సినిమాను రీరిలీజ్ చేసి జనాలను థియేటర్లకు రప్పించడం ఎంతటి సవాలైన పనో ఊహించవచ్చు.
ఇటీవల రీరిలీజ్ అయిన రెండు సినిమాలు వసూళ్ల పరంగా ఆశ్చర్యపరిచాయి. ఇందులో తుంబాడ్ నంబర్-1 స్థానంలో నిలువగా, యే జవానీ హై దీవానీ రెండో స్థానంలో నిలిచింది. ఈ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ రెండోసారి విడుదలై ఎనిమిదవ రోజున కూడా అద్భుత వసూళ్లను సాధించింది. ఈ సినిమాను 9 రోజుల్లో ₹14.45 కోట్లు వసూలు చేయడం విశేషం. ఇదే రీరిలీజ్ సహకారంతో ఈ సినిమా ₹200 కోట్ల క్లబ్ లో చేరింది.
తుంబాడ్ 1,075,000 టిక్కెట్లు అమ్మకాలతో రీరిలీజ్ వసూళ్లలో నంబర్-1 స్థానాన్ని కొనసాగిస్తోంది. యే జవానీ హై దీవానీ 57,000 టిక్కెట్ల అమ్మకాలతో నంబర్-2 స్థానంలో నిలిచింది. ఈ సంఖ్యను అధిగమించి నంబర్-1 స్థాయికి చేరుకోవాలంటే, 88% ఎక్కువ అమ్మకాలు అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు.
-
Home
-
Menu