'వీరమల్లు'లో సరికొత్తగా బాబీ డియోల్!

పవన్ కళ్యాణ్ భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ లు సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏ.ఎం. రత్నం సమర్పణలో, ఎ. దయాకర్ రావు మెగా సూర్య ప్రొడక్షన్ పై భారీ బడ్జెట్ తో నిర్మించారు.
మొదట ఈ చిత్రాన్ని క్రిష్ కొంతభాగాన్ని తెరకెక్కించగా.. ఆ తర్వాత జ్యోతికృష్ణ ఆన్ బోర్డులోకి వచ్చాడు. ఈ సినిమాలో జ్యోతికృష్ణ చేసిన మేజర్ ఛేంజెస్ లో బాబీ డియోల్ పోషించిన ఔరంగజేబు పాత్ర ఒకటి అట. ఆయన పాత్రను తొలుత చిత్రీకరించిన తర్వాత, ‘యానిమల్’ సినిమాలో బాబీ డియోల్ నటనను చూసిన దర్శకుడు జ్యోతి కృష్ణ ఆ పాత్రను పూర్తిగా రీడిజైన్ చేశాడట. ఔరంగజేబ్ క్యారెక్టర్ ను మరింత ఇంటెన్స్‌గా డిజైన్ చేసి.. ఆ పాత్రకు సంబంధించిన సన్నివేశాలను బాగా పెంచాడట జ్యోతికృష్ణ.
పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పరంగానూ ఆడియన్స్ ను థ్రిల్ చేస్తుందంటున్నాడు జ్యోతికృష్ణ. మొత్తంగా.. పవన్ కళ్యాణ్ 'వీరమల్లు' పాత్రలో చారిత్రక యోధుడిగా చేసే యుద్ధాలు, మేనరిజమ్స్ అన్నీ సరికొత్తగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయనే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు డైరెక్టర్ జ్యోతికృష్ణ.
Director Jyothi Krisna re-designed Bobby Deol’s character (Aurangzeb) in Hari Hara Veera Mallu after watching Animal
— L.VENUGOPAL🌞 (@venupro) June 30, 2025
It is known that Bobby Deol is playing the role of Mughal emperor Aurangzeb in Pawan Kalyan’s upcoming film Hari Hara Veera Mallu. The period drama is directed by… pic.twitter.com/65WTIZOY8B
-
Home
-
Menu