"శివంగి" ఫస్ట్ లుక్ ను లాంచ్ చేసిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి

"శివంగి" ఫస్ట్ లుక్ ను లాంచ్ చేసిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడిదేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో ఒక పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ సినిమాగా రాబోతుంది "శివంగి".ఈ సినిమాలో ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్ పై పి.నరేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి A.H కాషిఫ్ - ఎబినేజర్ పాల్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ లో జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.అయితే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ని బ్లాక్ బస్టర్ డెరైక్టర్ అనిల్ రావిపూడి ఈ రోజు లాంఛ్ చేశారు.
నల్లలుంగీ, చొక్కాతో కాలుపై కాలు వేసుకుని సోఫాలో హుందాగా కూర్చున్న ఆనంది లుక్ అదిరిపోయింది. విమెన్ సెంట్రిక్ సినిమాలలో శివంగి గ్రౌండ్ బ్రేకింగ్ కథ స్క్రీన్ ప్లే తో వుండబోతోంది. ఫస్ట్ లుక్ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది. ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కావొస్తున్నట్లుగా సమాచారం వుంది.అయితే మార్చి 7న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలియజేశారు.
-
Home
-
Menu