ఇంటెన్స్ థ్రిల్లర్ గా 'బ్లైండ్ స్పాట్'

టాలీవుడ్ లో నవీన్ చంద్ర రూటే సెపరేటు. ఒకవైపు అగ్ర కథానాయకుల చిత్రాల్లో క్యారెక్టర్స్ తో అలరిస్తూనే.. మరోవైపు హీరోగా డిఫరెంట్ మూవీస్ తో ఆకట్టుకుంటాడు. లేటెస్ట్ గా నవీన్ చంద్ర 'బ్లైండ్ స్పాట్' చిత్రంతో వస్తున్నాడు. ఈ చిత్రంలో నవీన్ చంద్ర ఓ ఇంటెన్స్ ఇన్వెస్టిగేటివ్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు.
రాశీ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో రాశి సింగ్, అలీ రెజా, రవి వర్మ, గాయత్రి భార్గవి, కిషోర్ కుమార్, హారిక పెడదా, హర్ష రోషన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రాకేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని మ్యాంగో మాస్ మీడియా బ్యానర్ పై రామకృష్ణ వీరపనేని నిర్మిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమా ట్రైలర్ రిలీజయ్యింది.
ట్రైలర్ ప్రారంభం నుంచే వర్షం, చిన్న పాప, ఉరేసుకున్న మహిళ – ఇలా మిస్టీరియస్ సీన్లతో ఆసక్తి రేపుతుంది. ఆద్యంతం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఆకట్టుకోనున్నట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ఇలాంటి జానర్ మూవీస్ ఎక్కువగా మలయాళంలో చూస్తుంటాం. మరి.. 'బ్లైండ్ స్పాట్' కూడా ఆ తరహాలోనే హిట్ అవుతుందేమో చూడాలి. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
-
Home
-
Menu