బ్లాక్ సూట్‌లో బ్లాస్టింగ్ లుక్.. సూపర్ స్టైలిష్ గా ఎన్టీఆర్!

మాస్ అనే పదానికి అసలు సిసలు నిర్వచనం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. అయితే ఇప్పుడు తారక్ సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. తాజాగా దుబాయ్ లో ఓ వివాహ వేడుకలో ఎన్టీఆర్ పాల్గొనగా, అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
ముఖ్యంగా దుబాయ్ లోని ఓ హోటల్ లో దిగిన ఫోటోలలో ఎన్టీఆర్ బ్లాక్ సూట్‌లో ఆకర్షణీయమైన డైనమిక్ ప్రెజెన్స్‌తో అదరగొడుతున్నాడు. ఈ ఫోటోలలో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు తారక్. ఎన్టీఆర్ అభిమానులు ఈ కొత్త లుక్‌ని తెగ ప్రశంసిస్తున్నారు.
ఇక వర్క్ ఫ్రంట్‌లో ఎన్టీఆర్ ప్రస్తుతం 'వార్ 2'ని ఫినిషింగ్ స్టేజ్ కు తీసుకొచ్చాడు. త్వరలో ప్రశాంత్ నీల్ షూట్ లో పాల్గొంటాడు. 'వార్ 2' చిత్రం ఈ ఏడాది ఆగస్టులో రానుండగా.. ఎన్టీఆర్-నీల్ మూవీ వచ్చే యేడాది జనవరిలో విడుదల తేదీ ఖరారు చేసుకుంది. కేవలం ఐదు నెలల గ్యాప్ లోనే ఈ రెండు భారీ చిత్రాలు ఆడియన్స్ ముందుకు రానున్నాయి.
-
Home
-
Menu