సోలోగా వచ్చేస్తున్న ‘భైరవం‘

బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో విజయ్ కనకమేడల తెరకెక్కించిన మల్టీస్టారర్ ‘భైరవం‘. ఈ చిత్రం చాలా రోజుల క్రితమే పూర్తైనా.. మంచి రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తూ వచ్చింది. ఆ తేదీ ఇప్పుడు పక్కాగా సెట్ అయ్యింది. మే 30న ఎలాంటి కాంపిటేషన్ లేకుండా ‘భైరవం‘ ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుంది. మే 30న రావాల్సిన ‘కింగ్డమ్‘ వాయిదా పడటంతో ‘భైరవం‘కి సోలో డేట్ దొరికినట్టు అయ్యింది.
ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రచారంలో స్పీడు పెంచుతుంది టీమ్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ కట్ రెడీ అయ్యిందట. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు.. లేటెస్ట్ గా ‘భైరవం‘ నుంచి మంచు మనోజ్, నారా రోహిత్ గరిటె పట్టి వంట చేసి.. టీమ్ అందరికీ వడ్డించిన వీడియోని రిలీజ్ చేసింది టీమ్. మనోజ్, రోహిత్ స్వయంగా వండి టీమ్ అందరికీ తమ వంటకాలను రుచి చూపించిన ఈ వీడియో ఆకట్టుకుంటుంది.
-
Home
-
Menu