భయపెట్టబోతున్న బెల్లంకొండ

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’. సెప్టెంబర్ 12న ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతుంది. ‘చావు కబురు చల్లగా’ ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించగా, సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్, సాంగ్ ఆకట్టుకోగా.. లేటెస్ట్ గా వచ్చిన టీజర్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. పాడుబడ్డ రేడియో స్టేషన్, ‘సువర్ణ మహల్’ అనే భవంతి, మిస్టరీ సంఘటనలు, భయంకరమైన విజువల్స్ టీజర్‌లో ఉత్కంఠ రేపాయి. చిన్నారి అదృశ్యం, సజీవదహనం, బస్సు కాలిపోవడం వంటి సన్నివేశాలు సస్పెన్స్ పెంచుతున్నాయి.
ఈ సినిమాలో బెల్లంకొండ ఒక రహస్యాన్ని చేధించే వ్యక్తిగా కనిపించగా, అనుపమ భయంతో వణికిపోతున్న షాట్స్ ఆకట్టుకుంటున్నాయి. చైతన్ భరద్వాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. మొత్తానికి న్యూ ఏజ్ హారర్ మిస్టరీగా వస్తున్న ‘కిష్కింధపురి’ టీజర్ గూస్‌బంప్స్ తెప్పించి, సినిమాపై అంచనాలను పెంచింది.
-
Home
-
Menu