బాలీవుడ్ రీమేక్ లో బెల్లంకొండ

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ రీమేక్స్ పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నాడు. ఇటీవల తమిళ రీమేక్ ఆధారంగా ‘భైరవం‘ చేసిన బెల్లంకొండ.. ఇప్పుడు ఓ బాలీవుడ్ సినిమాని రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. గతేడాది బాలీవుడ్‌లో విడుదలైన అద్భుతమైన విజయాన్ని సాధించిన ‘కిల్’ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషల్లో ఒకేసారి రీమేక్ చేయబోతున్నారు.
నిఖిల్ నాగేశ్ భట్ దర్శకత్వంలో రూపొందిన ‘కిల్‘ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఓటీటీలోనూ ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ దక్కింది. ముఖ్యంగా ఈ మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ కు మంచి పేరొచ్చింది.
ఈ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్, తమిళంలో ధృవ్ విక్రమ్ హీరోలుగా రూపొందించబోతున్నారు. ఇప్పటికే బెల్లంకొండతో ‘రాక్షసుడు’ సినిమాని తెరకెక్కించిన రమేష్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. జూలై 11న ‘కిల్‘ రీమేక్ ను మొదలు పెట్టనున్నట్టు తెలుస్తోంది.
-
Home
-
Menu