‘బ్యూటీ’ ట్రైలర్‌కి అద్భుత స్పందన

‘బ్యూటీ’ ట్రైలర్‌కి అద్భుత స్పందన
X
అంకిత్‌ కొయ్య, నీలఖి జంటగా నటించిన చిత్రం ‘బ్యూటీ’. వానర సెల్యూలాయిడ్, మారుతీ టీమ్ ప్రొడక్షన్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై అడిదాల విజయ్ పాల్ రెడ్డి, ఉమేష్ ఆర్ బన్సాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

అంకిత్‌ కొయ్య, నీలఖి జంటగా నటించిన చిత్రం ‘బ్యూటీ’. వానర సెల్యూలాయిడ్, మారుతీ టీమ్ ప్రొడక్షన్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై అడిదాల విజయ్ పాల్ రెడ్డి, ఉమేష్ ఆర్ బన్సాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జేఎస్‌ఎస్‌ వర్ధన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన ట్రైలర్ ను యంగ్ హీరో నాగచైతన్య లాంచ్ చేశాడు. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్, ఫాదర్ – డాటర్ ఎమోషన్, మిడిల్ క్లాస్ కష్టాలు అన్నీ ట్రైలర్‌లో ఆకట్టుకుంటున్నాయి. విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం ట్రైలర్‌కు మంచి బలాన్ని ఇచ్చింది.

మొత్తంగా ట్రైలర్ తో 'బ్యూటీ' మూవీ మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. ఈమధ్య కాలంలో స్టార్ కాస్ట్ తో సంబంధం లేకుండా కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ కి బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. మరి.. ఈలిస్టులో 'బ్యూటీ' కూడా చేరుతుందేమో చూడాలి.


Tags

Next Story