'తండేల్' నుంచి బ్యూటిఫుల్ రొమాంటిక్ మెలోడీ!

తండేల్ నుంచి బ్యూటిఫుల్ రొమాంటిక్ మెలోడీ!
X
'తండేల్' నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్ అయ్యింది. దేవిశ్రీప్రసాద్ సంగీతంలో శ్రీమణి రాసిన 'హైలెస్సో హైలెస్సా' సాంగ్ రొమాంటిక్ మెలోడీగా ఆకట్టుకుంటుంది.

సంక్రాంతి సినిమాల తర్వాత టాలీవుడ్ నుంచి రాబోతున్న క్రేజీ మూవీ 'తండేల్'. నాగచైతన్య కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం రూపొందుతుంది. 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా హిట్ అందుకున్న చందూ మొండేటి డైరెక్షన్.. ప్రతిష్ఠాత్మక గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ కావడంతో 'తండేల్'పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.

ఈ సినిమాలో నాగచైతన్యకి జోడీగా సాయిపల్లవి నటిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ 'బుజ్జి తల్లి' సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన 'నమో నమః శివాయ' సైతం బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ వచ్చింది. 'హైలెస్సో హైలెస్సా' అంటూ శ్రీమణి రాసిన ఈ మెలోడియస్ రొమాంటిక్ సాంగ్ ను నకాష్ అజీజ్, శ్రేయా ఘోషల్ ఆలపించారు.

ఆద్యంతం సముద్రం నేపథ్యంలో ఉండే ఈ చిత్రంలో జాలరిగా కనిపించబోతున్నాడు చైతూ. ఈ పాటలో చైతన్య లుక్ అథెంటిక్ గా ఆకట్టుకుంటుంది. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఎప్పటిలాగే తనదైన నేచురల్ పెర్ఫామెన్స్ తో అదరగొడుతుంది. వీరిద్దరి రొమాంటిక్ కెమిస్ట్రీ ఈ పాటలో బాగా వర్కవుట్ అయ్యింది. ఈ పాటలో మాంటేజెస్ బాగున్నాయి. మొత్తంగా.. ప్రచార చిత్రాలతో 'తండేల్'పై అంచనాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయని చెప్పొచ్చు.



Tags

Next Story