‘పెద్ది’ కోసం బీస్ట్ మోడ్ ఆన్!

‘పెద్ది’ కోసం బీస్ట్ మోడ్ ఆన్!
X
గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ స్పోర్ట్స్ మాస్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్నాడు.

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ స్పోర్ట్స్ మాస్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్లతో భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా, చెర్రీ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

తాజాగా చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాను ఊపేస్తోంది. 'చేంజ్ ఓవర్ ఫర్ పెద్ది. ప్యూర్ గ్రిట్.. ట్రూ జాయ్' అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఆ ఫోటోలో చెర్రీ గుబురు గడ్డంతో, రఫ్ హెయిర్ స్టైల్‌లో, సిక్స్ ప్యాక్ బాడీతో బీస్ట్‌లా కనిపిస్తూ హాలీవుడ్ హీరోల్ని తలపిస్తున్నాడు. మెగా ఫ్యాన్స్ ఈ ఫోటోకి 'బీస్ట్ మోడ్ ఆన్' అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఈ చిత్రంలో చెర్రీ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండటం ఈ సినిమాకి మరో హైలైట్‌.

మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ లతో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. 2026 మార్చి 27న, చెర్రీ పుట్టినరోజు సందర్భంగా 'పెద్ది' గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Tags

Next Story