మహా కుంభమేళాలో బాలయ్య ప్రత్యేక సన్నివేశాలు!

భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక వేడుకలలో ఒకటైన మహా కుంభమేళా ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో జరుగుతోంది. కోట్లాది భక్తులు ఈ పుణ్యస్నానాలకు హాజరవుతూ ఈ వేడుకకు గొప్పతనాన్ని చాటుతున్నారు. ఇలాంటి ఘనమైన సందర్భాలు సినిమాల్లో చూపించడం చిత్ర దర్శకులకూ ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తి రేపుతున్న చిత్రాల్లో 'అఖండ 2 – తాండవం' ఒకటి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ అఘోరా పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను మహా కుంభమేళా నేపథ్యంతో చిత్రీకరిస్తున్నారు.
అఘోరా పాత్రలో కనిపించే బాలకృష్ణకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను మహా కుంభమేళాలో చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. కోట్లాది మంది భక్తుల మధ్య చిత్రీకరించే ఈ సన్నివేశాలు సినిమాలో ఎంతో ప్రభావవంతంగా ఉండనున్నాయి. అలాగే మహా కుంభమేళా వంటి విస్తారమైన వేడుకల్ని సినిమాలో చూపించడం వల్ల కేవలం విజువల్ గ్రాండియర్ మాత్రమే కాదు, ఆధ్యాత్మికతను కూడా ప్రేక్షకులకు చేరవేయడం సాధ్యమవుతుంది. ఈ ఏడాది దసరా కానుకగా 'అఖండ 2' విడుదలకు ముస్తాబవుతోంది.
-
Home
-
Menu