‘భైరవద్వీపం‘ మ్యాజిక్ ను రీక్రియేట్ చేసిన బాలయ్య!

‘భైరవద్వీపం‘ మ్యాజిక్ ను రీక్రియేట్ చేసిన బాలయ్య!
X
‘భైరవద్వీపం‘ సినిమా 1994లో విడుదలై అఖండ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో విజయ్ పాత్రలో బాలకృష్ణ చేసే సాహసాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

తెలుగు చిత్ర సీమలో సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక ఇలా అన్ని తరహా జానర్లలోనూ నటించి తనకు తానే సాటి అనిపించుకున్న నటుడు నటరత్న ఎన్.టి.రామారావు. ఆయన వారసుడిగా చిత్రరంగ ప్రవేశం చేసిన బాలకృష్ణ సైతం తండ్రి బాటలోనే అన్ని తరహా పాత్రలతో అలరిస్తూ వస్తున్నాడు.


తండ్రి సినిమాల స్ఫూర్తితో బాలకృష్ణ తొలిసారి నటించిన జానపద చిత్రం ‘భైరవద్వీపం‘. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 1994లో విడుదలై అఖండ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో విజయ్ పాత్రలో బాలకృష్ణ చేసే సాహసాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.


సినిమా విడుదలై 30 ఏళ్లు పూర్తైనా ఇప్పటికీ ‘భైరవద్వీపం‘కి ఎంతోమంది అభిమానులున్నారు. తాజాగా ‘అన్ స్టాపబుల్‘ షో లో ‘భైరవద్వీపం‘ మ్యాజిక్ ను మరోసారి రీ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు నటసింహం. అందుకు సంబంధించిన వీడియో రిలీజ్ చేసింది ఆహా టీమ్.




Tags

Next Story