కోట శ్రీనివాసరావు మృతి పట్ల బాలకృష్ణ సంతాపం

కోట శ్రీనివాసరావు మృతి పట్ల బాలకృష్ణ సంతాపం
X
తెలుగు సినిమా రంగానికి తీరని లోటుగా మిగిలిన విధంగా.. మా అందరికీ ఎంతో ఇష్టమైన విలక్షణ నటుడు, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు గారు ఇక లేరనే వార్త తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. అని నందమూరి బాలకృష్ణ ఆయనకు సంతాపాన్ని తెలిపారు.

"నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రయాణంలో ఆయన పోషించిన ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత ఉంది. నాటకీయతను మించి, పాత్రలో జీవాన్ని పూరించి నటించిన కోట గారు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అమరులైపోయారు. తెలుగు సినిమాకు మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ ఆయన చేసిన పాత్రలు ప్రేక్షకుల మన్ననలు పొందాయి.

1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవలోనూ ఆయన అనునిత్యం సేవలందించారు. ఒక గొప్ప కళాకారుడిగా, మంచి నాయకుడిగా కోట గారు తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను." అని కోట శ్రీనివాసరావు మృతికి కి సంతాపాన్ని తెలిపారు బాలకృష్ణ.

Tags

Next Story