‘బ్యాడ్ బాయ్ కార్తీక్‘ టీజర్ టాక్

టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య కాస్త గ్యాప్ తర్వాత ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అంటూ కొత్త సినిమాతో వస్తున్నాడు. రామ్ దేశిన దర్శకత్వంలో శ్రీవైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజయ్యింది. భారీ యాక్షన్ సన్నివేశాలు, మాస్ డైలాగ్ లతో ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా ఉన్న ఈ టీజర్ ఆకట్టుకుంటుంది.
ఈ టీజర్‌లో నాగశౌర్య బ్యాడ్ బాయ్ కార్తీక్‌గా డైనమిక్ లుక్‌లో కనిపిస్తున్నాడు. విధి యాదవ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సముద్రఖని, సాయికుమార్, వీకే నరేష్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హారిస్ జయరాజ్ మ్యూజిక్, రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ టెక్నికల్ గా ఈ మూవీకి ప్లస్ కానున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ‘బ్యాడ్ బాయ్ కార్తీక్‘ త్వరలో ఆడియన్స్ ముందుకు రానుంది.
-
Home
-
Menu