'వార్ 2, కూలీ'తో 'బాహుబలి'!

వార్ 2, కూలీతో బాహుబలి!
X
పదేళ్ల క్రితం విడుదలైన 'బాహుబలి: ది బిగినింగ్' భారతీయ సినిమా స్థాయిని కొత్త మైలురాయికి తీసుకెళ్లింది. ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ మేగ్నమ్ ఓపస్, 'బాహుబలి 2: ది కన్‌క్లూజన్'తో కలిసి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టి, తెలుగు సినిమాను పాన్-ఇండియా స్థాయిలో నిలిపింది.

ఇప్పుడు మేకర్స్ ఈ రెండు భాగాలను కలిపి 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో సింగిల్ కట్‌గా అక్టోబర్ 31న రిలీజ్ చేయబోతున్నారు. దాదాపు 3 గంటల 45 నిమిషాల నిడివితో ఉండే ఈ వెర్షన్‌లో కొన్ని సన్నివేశాలు, పాటలు ట్రిమ్ చేశారట. అలాగే కొత్త ఫుటేజ్‌ను జోడించి, రెండు భాగాలను ఒకే సినిమాగా అందిస్తున్నారు.

'బాహుబలి.. ది ఎపిక్' టీజర్ ఇప్పటికే సిద్ధమైంది. ఆగస్టు 14న విడుదల కానున్న 'వార్ 2, కూలీ' చిత్రాలతో పాటు ఈ టీజర్ ను ప్రదర్శించనున్నారట. ప్రెజెంట్ కొనసాగుతున్న రీ-రిలీజ్ ట్రెండ్‌కి తోడు కొత్తగా రెండు భాగాలను కలిపి విడుదల చేసే ఈ ప్రయత్నం భారీ క్రేజ్‌ క్రియేట్ చేస్తోంది.

Tags

Next Story