హనుమాన్, బలగం చిత్రాలకు అవార్డులు

X
71వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో బాలకృష్ణ ‘భగవంత్ కేసరి‘ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డును పొందింది. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్‘ సినిమాకి గానూ బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ కేటగిరీలో అవార్డు లభించింది.
71వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో బాలకృష్ణ ‘భగవంత్ కేసరి‘ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డును పొందింది. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్‘ సినిమాకి గానూ బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ కేటగిరీలో అవార్డు లభించింది. ‘హనుమాన్‘ పాన్ ఇండియా లెవెల్ లో భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలకు మంచి పేరొచ్చింది.
ఇప్పటికే పలు వేదికలపై అవార్డుల పంట పండించిన ‘బలగం‘ చిత్రానికి బెస్ట్ లిరిక్స్ కేటగిరీలో నేషనల్ అవార్డు లభించింది. ఈ సినిమాలోని ఊరు పల్లెటూరి పాట రాసినందుకు కాసర్ల శ్యామ్ ను అవార్డు వరించింది.
Next Story
-
Home
-
Menu