'మన సినిమా.. ఫస్ట్ రీల్'కు అవార్డు!

తాజాగా ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో ప్రముఖ సినీ జర్నలిస్ట్ రెంటాల జయదేవ రచించిన 'మన సినిమా.. ఫస్ట్ రీల్' పుస్తకానికి అవార్డు దక్కింది. బెస్ట్ బుక్ ఆన్ తెలుగు సినిమా కేటగిరీలో ఈ పుస్తకానికి అవార్డు వచ్చింది.
ఈ పుస్తకం వివరాల్లోకి వెళితే.. ఫొటో ఫిల్మ్‌ను డెవలప్ చేసి, నెగెటివ్‌ను పాజిటివ్‌గా మార్చే ప్రక్రియలా... సినిమా చరిత్ర పట్ల పరిశీలన, విశ్లేషణ, విమర్శ, పరిశోధనల ద్వారా వెలుగులోకి వచ్చిన పుస్తకం 'మన సినిమా.. ఫస్ట్ రీల్'.
తెలుగు సినీ చరిత్రపై చాలా పుస్తకాలే వచ్చాయి. కానీ నిక్షిప్తమైన ఆధారాలతో, నిజనిష్ఠతో, శ్రమతో చేసిన అసలైన పరిశోధన మాత్రం చాలా తక్కువ. జయదేవ ఈ పుస్తకంలో తెలుగు సినిమాకు మాత్రమే కాక, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలకు కూడా తన పరిశోధన విస్తరించారు.
భారతీయ తొలి టాకీ ‘ఆలమ్ ఆరా’ (1931), తొలి కన్నడ చిత్రం ‘సతీ సులోచన’, మలయాళ టాకీ ‘బాలన్’ వివరాలతో పాటు ఇతర భాషల చిత్రాల ప్రభావాలను కూడా వివరించారు. ముఖ్యంగా పుస్తకంలో అత్యంత సంచలనాత్మకంగా చెప్పిన విషయం - తెలుగు సినీ చరిత్రలోని ఒక పెద్ద అపార్థం.
'భక్త ప్రహ్లాద' (1932, ఫిబ్రవరి 6) తొలి తెలుగు టాకీ అని ప్రసిద్ధి. కానీ జయదేవ ఆధారాలతో నిరూపించినది ఏమంటే, 'కాళిదాస్' అనే సినిమా ముందే, అంటే 1931 అక్టోబర్ 31న విడుదలై, తెలుగు మాటలు, త్యాగరాయ కీర్తనలతో ప్రేక్షకులను అలరించింది.
ఇది తొలి దక్షిణ భారతీయ భాషా టాకీగా నిలిచింది. కానీ తమిళులు తమ తొలి టాకీగా దీన్ని గౌరవించుకుంటే, తెలుగువారు మాత్రం నిర్లక్ష్యం చేశారు. జయదేవ ఈ తప్పును సరిదిద్దే ప్రయత్నం చేశారు.
-
Home
-
Menu