సినిమాకాన్ లో ‘అవతార్ : ఫైర్ అడ్ యాష్’ ట్రైలర్ ప్రదర్శన

లాస్ వెగాస్‌లో జరిగిన సినిమాకాన్ కార్యక్రమంలో ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ట్రైలర్‌ను తొలిసారి ప్రదర్శించారు. ఇది జేమ్స్ కామెరూన్ రూపొందించిన అవతార్ సిరీస్‌లో మూడవ సినిమా. మొదటి రెండు భాగాల లాగే కాకుండా, ఈ మూడవ చిత్రం ఎలాంటి ఆలస్యం లేకుండా విడుదలకు సిద్ధమవుతోంది. ఎందుకంటే కామెరూన్ ఈ చిత్రాన్ని ఇతర భాగాలతో పాటు ఒకేసారి చిత్రీకరించారు. సినిమాకాన్ కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులు 3డి గ్లాసులు ధరించి విడుదలకు ముందు ఉన్న ప్రత్యేక దృశ్యాలను చూశారు.
ఈ ట్రైలర్ పాండోరాలోని రెండు కొత్త నావి తెగల పరిచయంతో మొదలవుతుంది. వాయు మార్గాల్లో బెలూన్‌లాంటి వాహనాలతో ప్రయాణించే విండు ట్రేడర్స్, ఇక్రాన్‌లపై గగనంలో దూసుకెళ్లే ఫైర్ పీపుల్. ఆకాశంలో భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ విజువల్స్ ను తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు కామరూన్. వెరైటీ వార్తా సంస్థ ప్రకారం, జో సల్డానా ట్రైలర్‌ను పరిచయం చేస్తూ మాట్లాడుతూ, “విండు ట్రేడర్స్ ఓ శాంతియుత, గగనచార నామాడిక్ తెగ. ఇక అష్ పీపుల్ అంటే.. ఇవాళ నావిలా ఉన్నా, వారు ఐవా దేవతను వదిలి పోయినవారు,” అని తెలిపారు.
కామెరూన్ న్యూజిలాండ్ నుంచి వీడియో కాల్ ద్వారా పాల్గొని మాట్లాడుతూ, “ఇక్కడ న్యూజిలాండ్‌లో ఫైర్ అండ్ అాష్ ముగింపు పనుల్లో ఉన్నాను. ఈ సినిమా డిసెంబర్ 19న విడుదల కానుంది. ఇది ఇప్పుడు వేగంగా రైలు బోగీలా మన ముందుకు వస్తోంది,” అని అన్నారు. కామెరూన్ ప్రేక్షకులకు మరువలేని విజువల్ అద్భుతాన్ని అందించేందుకు మరోసారి సిద్ధమవుతున్నాడు.
-
Home
-
Menu