'అవతార్ 3' తెలుగు ట్రైలర్

అవతార్ 3 తెలుగు ట్రైలర్
X
ప్రపంచ సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన చిత్రం 'అవతార్'. ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్‌ కామెరూన్ తెరకెక్కించిన ‘అవతార్’ సిరీస్‌లో మూడో భాగం 'అవతార్: ఫైర్ అండ్ యాష్' నుంచి సరికొత్త ట్రైలర్ రిలీజయ్యింది.

ప్రపంచ సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన చిత్రం 'అవతార్'. ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్‌ కామెరూన్ తెరకెక్కించిన ‘అవతార్’ సిరీస్‌లో మూడో భాగం 'అవతార్: ఫైర్ అండ్ యాష్' నుంచి సరికొత్త ట్రైలర్ రిలీజయ్యింది. డిసెంబర్ 19న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సెకండ్ పార్ట్ ‘ది వే ఆఫ్ వాటర్’లో సముద్ర గిరిజనుల్ని చూపించిన కామెరూన్, ఈసారి 'యాష్ పీపుల్' అనే అగ్నిని ఆరాధించే కొత్త నవీ తెగను థర్డ్ పార్ట్ లో పరిచయం చేయబోతున్నాడు. వీరు పండోరాకు అతిపెద్ద ముప్పుగా మారనున్నారు. అగ్నిపర్వతాల ప్రాంతాలు, లావా ప్రవాహాలు, అంతకుముందెన్నడూ చూడని కొత్త జీవులు – ఇవన్నీ 'అవతార్ 3'లో ప్రేక్షకులను అబ్బురపరిచేలా ఉండబోతున్నట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. తెలుగు సహా భారతీయ భాషల్లో విడుదలకానున్న ఈ చిత్రం మరోసారి విజువల్ ట్రీట్ అందించడం ఖాయమనే అంచనాలున్నాయి.



Tags

Next Story