అర్జున్ బజ్ పెరుగుతోంది!

అర్జున్ బజ్ పెరుగుతోంది!
X
నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించిన 'అర్జున్ S/O వైజయంతి' సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ లభించింది.

నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించిన 'అర్జున్ S/O వైజయంతి' సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ లభించింది. ఈ మూవీ రన్‌టైమ్ 2 గంటల 24 నిమిషాలు.

తల్లీకొడుకుల అనుబంధం హైలైట్ గా ఈ సినిమా రాబోతుంది. విజయశాంతి పోషించిన పవర్‌ఫుల్ ఐపీఎస్ వైజయంతి క్యారెక్టర్. కళ్యాణ్ రామ్ పోషించిన అర్జున్ పాత్ర ఈ సినిమాలో హైలైట్ గా నిలవనున్నాయట. సెన్సార్ టాక్ ప్రకారం ఈ సినిమా క్లైమాక్స్ ఎంతో ప్రత్యేకతతో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఊహించని మలుపులతో 'అర్జున్ S/O వైజయంతి' ఆద్యంతం మెప్పిస్తుందనే టాక్ సెన్సార్ సభ్యుల నుంచి వినిపిస్తుంది.

అజనీష్ లోకనాథ్ సంగీతం, రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్‌ ఈ సినిమాకి టెక్నికల్ గా ప్లస్ పాయింట్స్ గా నిలవనున్నాయట. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ కి జోడీగా సయీ మంజ్రేకర్ నటించగా.. సోహైల్ ఖాన్, శ్రీకాంత్, పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో మెప్పించనున్నారు.

ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోక క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన 'అర్జున్ S/O వైజయంతి' నుంచి ఈరోజు 'ముచ్చటగా బంధాలే' అనే గీతం రాబోతుంది. ఈ పాటను చిత్తూరులో గ్రాండ్ గా లాంఛ్ చేయబోతున్నారు. మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడనే ప్రచారం ఉంది. ఏప్రిల్ 18న 'అర్జున్ S/O వైజయంతి' రిలీజ్ కు రెడీ అవుతుంది.



Tags

Next Story