లాఠీ పవర్ చూపిస్తున్న అర్జున్ సర్కార్!

నేచురల్ స్టార్ నాని పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్న చిత్రం ‘హిట్ 3‘. ఇప్పటికే రెండు భాగాలుగా విజయాలు సాధించిన ‘హిట్‘ సిరీస్ లో థర్డ్ పార్ట్ ఇది. ‘హిట్.. ది థర్డ్ కేస్‘ అంటూ శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి ఈరోజు నాని బర్త్ డే స్పెషల్ గా టీజర్ రిలీజ్ చేశారు.
‘సర్కార్స్ లాఠీ‘ అంటూ ఈ సినిమాలో అర్జున్ సర్కార్ పాత్ర లాఠీ పవర్ ఏంటో ఈ టీజర్ లో చూపించే ప్రయత్నం చేశారు. టీజర్ లో యాంగ్రీ పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్ గా నాని స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది. ఓ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అర్జున్ సర్కార్ విలన్ల పాలిట ఎంతటి క్రూయల్ గా మారాల్చి వస్తుందో కూడా ఈ టీజర్ లో చూపించారు. మొత్తంగా.. నానిని ఇప్పటివరకూ చూడనటువంటి ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రను ‘హిట్ 3‘లో చూడబోతున్నాము.
ఈ మూవీలో నానికి జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తుంది. వాల్ పోస్టర్ సినిమాస్, యునానిమస్ ప్రొడక్షన్స్ పై ప్రశాంతి త్రిపురనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. మే 1న ‘హిట్ 3‘ విడుదలకు ముస్తాబవుతోంది.
-
Home
-
Menu