‘అర్జున్ రెడ్డి’కి ఎనిమిదేళ్లు

‘అర్జున్ రెడ్డి’కి ఎనిమిదేళ్లు
X
టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. కేవలం 5 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంది.

టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. కేవలం 5 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో సందీప్ రెడ్డి వంగా ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అవ్వగా.. ఈ చిత్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ యూత్ కు ఐకాన్ గా మారిపోయాడు. ‘అర్జున్ రెడ్డి‘ చిత్రాన్ని ఆ తర్వాత హిందీలో ‘కబీర్ సింగ్‘గా రీమేక్ చేసి అక్కడా ఘన విజయాన్ని అందుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి.

ఇవాళ్టితో ‘అర్జున్ రెడ్డి‘ విడుదలై 8 ఏళ్లయ్యింది. ఈ సందర్భంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ చేశాడు. ‘ఎనిమిదేళ్ల క్రితం ‘అర్జున్ రెడ్డి‘ నా జీవితాన్ని శాశ్వతంగా మార్చింది. ఈ సినిమాను ఉద్యమంలా నిలిపింది మీ ప్రేమే. ప్రతి ఫ్రేమ్‌కు అర్థం వచ్చిందంటే, అది ప్రేక్షకుల నిజాయితీతో కూడిన స్వీకరణ వలన‘ అంటూ తన నటీనటులు, బృందం, ముఖ్యంగా ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే, హీరో విజయ్ దేవరకొండతో మేకింగ్ వీడియోను కూడా షేర్ చేశాడు.



Tags

Next Story