వాస్తవ సంఘటనలతో ‘అర్జున్ చక్రవర్తి‘

X
వాస్తవ సంఘటనల ప్రేరణతో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో శ్రీని గుబ్బల నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే 46 అంతర్జాతీయ చలనచిత్ర అవార్డులు గెలుచుకుందట.
వాస్తవ సంఘటనల ప్రేరణతో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో శ్రీని గుబ్బల నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే 46 అంతర్జాతీయ చలనచిత్ర అవార్డులు గెలుచుకుందట. ఈ చిత్రంలో విజయ్ రామరాజు హీరోగా నటించారు.
కబడ్డీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం నల్గొండకు చెందిన కబడ్డీ ఆటగాడు నాగులయ్య జీవితం ఆధారంగా తెరకెక్కిందట. అయితే.. ఆయన నిజ జీవిత సంఘటనల్లో 60 శాతం వాస్తవం, 40 శాతం ఫిక్షన్ జోడించి కథను రెడీ చేశారట డైరెక్టర్ విక్రాంత్. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజయ్యింది.
ఒక జాతీయ స్థాయి కబడ్డీ ఆటగాడు గెలుపు-ఓటముల మధ్య ఎలా ముందుకు సాగాడు? అతడిని పరిస్థితులు ఎలా తాగుబోతు జీవితానికి నెట్టాయి? అనే అంశాలను ఈ ట్రైలర్ లో చూపించారు. ఆగస్టు 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Next Story
-
Home
-
Menu