అనుష్క–బన్నీ ఫన్ చిట్‌చాట్ వైరల్!

స్వీటీ అనుష్క శెట్టి నటించిన తాజా చిత్రం ఘాటి పై భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అనుష్క పవర్‌ఫుల్ మాస్ పాత్రలో కనిపించబోతోంది.



ఈసారి అనుష్క ఆఫ్‌లైన్ ప్రమోషన్స్ కాకుండా ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకుంది. ఫోన్ కాల్స్, ఆడియో ప్రమోషన్స్ ద్వారా చిత్రానికి హైప్ క్రియేట్ చేస్తోంది. రానాతో చేసిన ఫోన్ సంభాషణ తర్వాత, తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో చేసిన ఆడియో చిట్‌చాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సుమారు ఆరు నిమిషాల పాటు సాగిన ఈ కాల్‌లో బన్నీ అనుష్కను ఆటపట్టిస్తూ – “ఇప్పుడు నిన్ను స్వీటీ అనాలా, ఘాటి అనాలా?” అని అడిగాడు. అలాగే అనుష్క చేసిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను ప్రశంసిస్తూ, అరుంధతి, భాగమతి, రుద్రమదేవి తరహాలోనే ఘాటి కూడా గుర్తింపు తెస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. అంతేకాదు, పుష్ప – ఘాటి క్రాస్ ఓవర్ ఐడియాను కూడా ప్రస్తావించి ఫన్ క్రియేట్ చేశాడు.

ఇప్పటికే ట్విట్టర్ స్పేస్, ఫోన్ ఇంటర్వ్యూలతో సందడి చేసిన అనుష్క, బన్నీతో చేసిన ఈ ఆడియో ప్రమోషన్ వల్ల ఘాటిపై బజ్ మరింత పెరిగింది. ఇక మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఎలా అలరిస్తుందో చూడాలి.

Tags

Next Story