మరో మలయాళ సూపర్ హిట్ ... 'రేఖాచిత్రం'

మరో మలయాళ సూపర్ హిట్ ... రేఖాచిత్రం
X

మలయాళ సూపర్ హిట్ 'కిష్కింధ కాండం' తో ప్రేక్షకులను మెప్పించి మంచి క్రేజ్ తెచ్చుకున్న అసిఫ్ అలీ తాజాగా 'రేఖాచిత్రం' అనే థ్రిల్లర్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జోఫిన్ టి. చాకో దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, జనవరి 9న విడుదలై, ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

'కిష్కింధ కాండం' ఘన విజయం తరువాత, అసిఫ్ అలీ సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. 2018, 'కూమన్' వంటి చిత్రాలు కూడా అతనికి ఓటీటీ వేదికపై మంచి పేరు తీసుకువచ్చాయి. తాజాగా విడుదలైన రేఖాచిత్రం తో అసిఫ్ అలీ మళ్ళీ ప్రేక్షకుల మన్ననలు పొందారు.

రిపోర్టుల ప్రకారం, 'రేఖాచిత్రం' ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 5 రోజుల్లోనే ₹27 కోట్లు వసూలు చేసింది. ఇది టోవినో థామస్, త్రిష జంటగా వచ్చిన ఐడెంటిటీ వసూళ్లను దాటిపోయింది. ఐడెంటిటీ ఇప్పటివరకు కేవలం ₹18 కోట్లు మాత్రమే సాధించింది.

కేరళ మార్కెట్‌లో 'రేఖాచిత్రం' ఇప్పటివరకు ₹12.25 కోట్లు వసూలు చేసి, త్వరలోనే ₹15 కోట్లు మార్క్ చేరుకోనుంది. 'కిష్కింధ కాండం' స్థాయిలో విజయాన్ని 'రేఖాచిత్రం' సాధించకపోయినా, ఇది కూడా ఒక బలమైన చిత్రంగా నిలిచింది. ముఖ్యంగా అసిఫ్ అలీ, అనస్వర రాజన్ నటనను ప్రేక్షకులు బాగా మెచ్చుకున్నారు.

థియేటర్లలో మరియు ఓటీటీ వేదికలపై వరుస విజయాలతో, అసిఫ్ అలీ ప్రేక్షకులలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన మలయాళ చిత్ర పరిశ్రమలో “మినిమమ్ గ్యారంటీ” స్టార్‌గా ఎదుగుతున్నారు.

Next Story