రాజ్ తరుణ్‌పై మరో కేసు

రాజ్ తరుణ్‌పై మరో కేసు
X

టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ మళ్లీ వివాదంలో చిక్కుకున్నాడు. అతడిపై నార్సింగి పోలీసులు మరో కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు.

లావణ్య ఆరోపణల ప్రకారం, కోకాపేటలోని విల్లాలో తాను నివసిస్తుండగా రాజ్ తరుణ్ పంపిన వ్యక్తులు తనపై దాడి చేసి బంగారు ఆభరణాలు లాక్కెళ్లారని, తన పెంపుడు కుక్కలను చంపేశారని పేర్కొన్నారు. బెల్టులు, గాజు సీసాలతో మూడు సార్లు దాడి జరిగిందని ఆమె ఆరోపించింది.

2016లో రాజ్ తరుణ్‌తో కలిసి విల్లాను కొనుగోలు చేశానని, కానీ వ్యక్తిగత విభేదాల కారణంగా 2024 మార్చిలో అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడని తెలిపింది. ప్రస్తుతం ఆ ఇంటి యాజమాన్య హక్కులపై కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందని పేర్కొంది.

లావణ్య ఫిర్యాదు ఆధారంగా రాజ్ తరుణ్‌తో పాటు మణికంఠ తంబాడీ, రాజ్ శేఖర్, సుశి, అంకిత్ గౌడ్, రవితేజలపై కేసు నమోదై దర్యాప్తు కొనసాగుతోంది.

Tags

Next Story