టాలీవుడ్ కి మరో బాలీవుడ్ స్టార్

టాలీవుడ్ కి మరో బాలీవుడ్ స్టార్
X
మైథలాజికల్ స్టోరీస్ ను బేస్ చేసుకుని కథలు చెప్పడంలో సిద్ధహస్తుడు ప్రశాంత్ వర్మ. పెద్దగా స్టార్ కాస్టింగ్ లేకుండానే ‘హనుమాన్‘తో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టాడు.

మైథలాజికల్ స్టోరీస్ ను బేస్ చేసుకుని కథలు చెప్పడంలో సిద్ధహస్తుడు ప్రశాంత్ వర్మ. పెద్దగా స్టార్ కాస్టింగ్ లేకుండానే ‘హనుమాన్‘తో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. తన డైరెక్షన్ లో ‘జై హనుమాన్‘ తీర్చిదిద్దుతున్న ప్రశాంత్.. తాను స్థాపించిన PVCU (ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్) నుంచి మరికొన్ని సినిమాలను తీసుకొస్తున్నాడు.

ఈ లిస్టులో రాబోతున్న చిత్రం 'మహా కాళి'. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో ఈ ఫాంటసీ డ్రామా రూపొందుతుంది. ఈ సినిమా కథా నేపథ్యం బెంగాల్ ప్రాంతానికి సంబంధించినదిగా చెబుతున్నారు. మహిళా సూపర్ హీరో కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది.

తాజాగా ‘మహా కాళి‘ కోసం బాలీవుడ్ వెటరన్ యాక్టర్ అక్షయ్ ఖన్నా ఆన్ బోర్డులోకి వచ్చాడు. బాలీవుడ్ లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అక్షయ్ ఖన్నా ‘ఛావా‘తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. ‘ఛావా‘ సినిమాలో ఔరంగజేబుగా విలన్ పాత్రలో మెప్పించాడు.



Tags

Next Story