'కింగ్డమ్'పై అనిరుధ్ రివ్యూ!

టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రాల్లో ‘కింగ్డమ్’ ఒకటి. విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌ను గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్నాడు. మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇటీవల ఈ సినిమాను కొంతభాగం చూశానంటూ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ చేసిన వ్యాఖ్యలు సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 'చివరి 40 నిమిషాలు చూసాను, సినిమాను బాగా ఎంజాయ్ చేశా. ఫైర్ ఎమోజీలు అవసరం లేదు, ఇదే రివ్యూ!' అంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు అనిరుధ్.
ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, మెలోడియస్ రూపొందిన ఫస్ట్ సాంగ్ ‘హృదయం లోపల’ ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కాబోతోంది.
-
Home
-
Menu