మెగాస్టార్ మూవీకి అనిరుధ్ మ్యూజిక్?

మెగాస్టార్ మూవీకి అనిరుధ్ మ్యూజిక్?
X
గడిచిన కొన్ని సంవత్సరాలుగా మ్యూజిక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్న పేరు అనిరుధ్ రవిచందర్. తన మ్యూజికల్ మ్యాజిక్ తో హీరోలను ఎలివేట్ చేయడంలో అనిరుధ్ ది అందెవేసిన చేయి. కొంతకాలం క్రితం వరకూ సినిమాలలోని పాటలకే ఫ్యాన్స్ ఉండేవారు.

గడిచిన కొన్ని సంవత్సరాలుగా మ్యూజిక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్న పేరు అనిరుధ్ రవిచందర్. తన మ్యూజికల్ మ్యాజిక్ తో హీరోలను ఎలివేట్ చేయడంలో అనిరుధ్ ది అందెవేసిన చేయి. కొంతకాలం క్రితం వరకూ సినిమాలలోని పాటలకే ఫ్యాన్స్ ఉండేవారు. కానీ అనిరుధ్ ఆగమనంతో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ని ఆరాధించే అభిమానులు పెరిగారు.

కోలీవుడ్ సీనియర్స్ కమల్ హాసన్, రజనీకాంత్ లకు గ్రేట్ కమ్‌బ్యాక్స్ గా నిలిచిన 'విక్రమ్, జైలర్' చిత్రాల విజయాలలో అనిరుధ్ మ్యూజిక్ దే మేజర్ పార్ట్. తెలుగులోనూ పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, నాని వంటి హీరోలకు సంగీతాన్ని సమకూర్చిన క్రెడిట్ అనిరుధ్ కి ఉంది. అయితే ఇప్పుడు తెలుగులో మరింతగా బిజీ అవ్వబోతున్నాడు ఈ కోలీవుడ్ రాక్‌స్టార్.

లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవికి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చబోతున్నాడనే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించే సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చనున్నాడట. ఇప్పటికే అనిరుధ్ తో చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఒకవేళ అదేగానీ జరిగితే రజనీ, కమల్ తరహాలోనే అనిరుధ్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి సైతం తన బి.జి.ఎమ్. తో మంచి మాస్ ఎలివేషన్స్ ఇస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags

Next Story