అనిల్ స్పీడు అదిరిందిగా!

అనిల్ స్పీడు అదిరిందిగా!
X
అగ్ర కథానాయకులతో సినిమాలంటేనే స్క్రిప్ట్ కోసం సంవత్సరాల తరబడి సమయాన్ని వెచ్చిస్తుంటారు. కానీ అనిల్ రావిపూడి రూటే సెపరేటు.

అగ్ర కథానాయకులతో సినిమాలంటేనే స్క్రిప్ట్ కోసం సంవత్సరాల తరబడి సమయాన్ని వెచ్చిస్తుంటారు. కానీ అనిల్ రావిపూడి రూటే సెపరేటు. ఈ ఏడాది సంక్రాంతికి 'సంక్రాంతికి వస్తున్నాం'తో ఘన విజయాన్నందుకున్న అనిల్.. ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా అప్పుడే వచ్చే సంక్రాంతి బరిలో సినిమాకోసం స్క్రిప్ట్ సిద్ధం చేసేశాడు.

మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి తెరకెక్కించబోయే మూవీకి సంబంధించి స్క్రిప్ట్ దాదాపు పూర్తయ్యిందట. తన సెంటిమెంట్ ప్లేస్ వైజాగ్ లో ఈ మూవీ స్క్రిప్ట్‌ను పూర్తి చేశాడట అనిల్. విశాఖపట్టణంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామిని అనిల్ రావిపూడి ఆదివారం దర్శించుకున్నాడు. చిరంజీవి హీరోగా తాను తీయబోయే చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ని స్వామి సన్నిధిలో పెట్టి పూజలు నిర్వహించాడు. సంగీత దర్శకుడు భీమ్స్‌ సిసిరోలియో కూడా అనిల్ తో పాటు పాల్గొన్నాడు.

మెగాస్టార్ సినిమాని మే నెల నుంచి మొదలు పెట్టనున్నట్టు తెలిపాడు. ఈ మూవీలో చిరంజీవిని ‘గ్యాంగ్‌లీడర్, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు' రేంజ్‌ లో చూపించబోతున్నాడట. ఈ చిత్రంలో కూడా రమణ గోగుల ఒక పాట పాడించబోతున్నారట.

Tags

Next Story