చిరు కోసం పర్ఫెక్ట్ స్కెచ్ వేసిన అనిల్!

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న అనిల్ రావిపూడి, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో తర్వాతి సినిమాకి సన్నాహాలు చేస్తున్నాడు. చిరు సినిమాని అత్యంత తక్కువ సమయంలో అంటే కేవలం 80 రోజుల లోపే పూర్తి చేయాలని అనిల్ ప్లాన్ చేస్తున్నాడట.
వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం‘ విషయంలోనూ అదే చేశాడు అనిల్ రావిపూడి. సంక్రాంతికి కేవలం కొన్ని నెలల ముందే మొదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం‘ సినిమాని శరవేగంగా పూర్తి చేసి విడుదల చేశాడు. పక్కా ప్లానింగ్ తో తక్కువ కాల్షీట్స్ లో సినిమాని తీర్చిదిద్దడం వలన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ భారీగా తగ్గుతుంది.
ఇక చిరు సినిమా కంటెంట్ విషయానికొస్తే.. తన డైరెక్షన్ లో మెగాస్టార్ ని కొత్త కోణంలో చూపించడానికి సిద్ధమవుతున్నాడట అనిల్ రావిపూడి. చిరులోని ఎంటర్ టైన్ మెంట్ యాంగిల్ ను పూర్తి స్థాయిలో వాడుకునే విధంగా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట. అలాగే మెగాస్టార్ మార్క్ మాస్ ఎలిమెంట్స్ కూడా తన సినిమాలో ఉండేటట్టు స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట. ప్రస్తుతం ‘విశ్వంభర‘తో బిజీగా ఉన్న చిరు.. ఆ తర్వాత చేయబోయేది అనిల్ రావిపూడి సినిమానే అని తెలుస్తోంది.
-
Home
-
Menu