రాజమండ్రిలో 'ఆంధ్రా కింగ్ తాలూకా'

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా'. వరుసగా మాస్ మూవీస్ చేసిన రామ్.. ఈసారి అందుకు భిన్నంగా ఓ కంటెంట్ ఓరియెంటెడ్ మూవీతో రాబోతున్నాడు. ఇందులో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. కీలక పాత్రలో ఉపేంద్ర కనిపించబోతున్నాడు. ఇంకా.. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్ వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రంలో రామ్ ఓ డై హార్డ్ ఫ్యాన్ 'సాగర్' పాత్రలో కనిపించబోతుండగా, కన్నడ స్టార్ ఉపేంద్ర ఒక సూపర్ స్టార్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ ఇద్దరి మధ్య సన్నివేశాలు కీలకంగా ఉండనున్నాయట. ఇప్పటికే రిలీజైన టైటిల్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ లభించగా, రీసెంట్‌గా షురూ అయిన రాజమండ్రి షెడ్యూల్‌కు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రామ్ ఈ సినిమాకోసం తన లుక్‌ను పూర్తిగా మార్చుకుని సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఈ వర్కింగ్ స్టిల్స్ లో రావు రమేష్, సత్య కూడా కనిపిస్తున్నారు.
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఫేమ్ మహేష్ బాబు పి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మ్యూజికల్ డ్యూయో వివేక్ - మెర్విన్ ఈ సినిమాకి సంగీత బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.
-
Home
-
Menu