అంచనాల్లేని అద్భుతం!

ఎలాంటి హైప్ లేకుండా వచ్చిన ‘మహావతార్ నరసింహా’ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. ‘హరిహర వీరమల్లు’తో పాటు విడుదలైన ఈ యానిమేటెడ్ డివోషనల్ మూవీ చిన్నవారికే కాదు పెద్దవారికీ ఎంతో నచ్చుతుంది. హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం విష్ణువు నరసింహ అవతారాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించబడింది. యానిమేషన్‌తో పురాణాలను మిళితం చేస్తూ గ్రాండ్ విజువల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
మొదటి రోజే పాన్ ఇండియా లెవెల్లో రూ.2.29 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం, రెండో రోజు 100% పైగా గ్రోత్‌తో రూ.4.70 కోట్లు రాబట్టింది. బుక్ మై షోలో గంటకు 20 వేల టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఇది యానిమేటెడ్ సినిమాలకి మనదేశంలో కలిగిన ఆదరణకు నిదర్శనం.
ఇటీవల డివోషనల్ బ్యాక్‌డ్రాప్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధిస్తున్నాయి. అయితే.. ఓ యానిమేషన్ మూవీ ఈ రేంజులో సక్సెస్ అవ్వడం విశేషం. 'మహావతార్' సిరీస్ లో ఇకపై వరుస సినిమాలను తీసుకురాబోతుంది హోంబలే ఫిల్మ్స్.
-
Home
-
Menu