అంజనాదేవి ఆరోగ్యంపై వచ్చిన రూమర్లకు ముగింపు!

X
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అనారోగ్యానికి గురయ్యారనే వార్తలు ఒక్కసారిగా హల్‌చల్ చేశాయి. ఆమెకు ఏం అయ్యిందో తెలియక మెగా ఫ్యామిలీ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ విషయంపై తాజాగా స్పష్టత వచ్చింది. అంజనాదేవి కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే హాస్పిటల్‌కి వెళ్లారని మెగా ఫ్యామిలీ పీఆర్ టీమ్ వెల్లడించింది. అంజనాదేవి ఆరోగ్యం విషయంలో అనవసర ఆందోళన అవసరం లేదని తెలియడంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
విషయమేమిటంటే అంజనాదేవి ఆరోగ్యం బాగోలేదని ఆమెను ఈరోజు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించారనే వార్తలు ఉదయం నుంచి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మరోవైపు జనసేన అధినేత, ఎ.పి. డిప్యూటీ సి.ఎమ్. పవన్ కళ్యాణ్ తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ చేరుకుంటున్నారనే ప్రచారమూ జరిగింది.
Next Story
-
Home
-
Menu