'పుష్ప 3'పై అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్!

పుష్ప 3పై అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్!
X
‘పుష్ప 2: ది రూల్’ భారీ విజయాన్ని సాధించి, బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

‘పుష్ప 2: ది రూల్’ భారీ విజయాన్ని సాధించి, బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సినిమా ఓటీటీలో కూడా సూపర్ హిట్ అవడంతో, చిత్ర బృందం థ్యాంక్స్ మీట్ నిర్వహించింది.

ఈ సందర్భంగా అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ ను ప్రశంసిస్తూ, 'ఈ సినిమా ద్వారా మా అందరి జీవితాలు అర్థవంతమయ్యాయి. సుకుమార్ కలల నుంచి పుట్టిన పాత్రలమే మేమంతా' అని అన్నాడు. 'సినిమా విజయాన్ని హిట్ చేయగలిగేది ఒక్క దర్శకుడే. నేను బాగా నటించానంటే, దానికి కారణం సుకుమారే' అని తెలిపాడు.

అల్లు అర్జున్ మాట్లాడుతూ 'పుష్ప పూర్తి కథ ఇప్పటికీ చెప్పలేదు. ఇది రెండో ఇంటర్వెల్ మాత్రమే' అని పేర్కొన్నాడు. సుకుమార్ కూడా ‘పుష్ప’ ఫ్రాంచైజ్ మరిన్ని భాగాలు రావొచ్చని హింట్ ఇచ్చాడు. ఈ విజయాన్ని తన అభిమానులకు అంకితం చేస్తున్నానని చెప్పిన అల్లు అర్జున్, ‘పుష్ప 3’ ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో చూడాలి' అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Tags

Next Story