అల్లు అర్జున్ - ప్రశాంత్ నీల్ ‘రావణం‘

టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో మరో క్రేజీ కాంబోకి సన్నాహాలు జరుగుతున్నాయి. అదే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయిక. ఈ ఇద్దరి కలయికలో సినిమాకోసం స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చాన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చారు నిర్మాత దిల్ రాజు. ‘తమ్ముడు’ ప్రమోషన్లలో పాల్గొంటున్న దిల్ రాజు, ‘‘రావణం’ సినిమా పక్కా ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లోనే ఉంటుంది. అల్లు అర్జున్ హీరోగానే ఉంటారు. నేనే ఈ సినిమాను నిర్మిస్తున్నాను. అయితే ఇద్దరూ ప్రస్తుతానికి బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ కొంత ఆలస్యం అవుతుంది‘ అని స్పష్టం చేశారు.
అల్లు అర్జున్ - ప్రశాంత్ కలయికలో సినిమా గురించి కొన్ని నెలలుగా ఊహాగానాలు వినిపించినా.. ఇప్పుడు దిల్ రాజు టైటిల్ సైతం ఫిక్స్ చేశామని చెప్పడంతో, ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఫైనల్ గా కన్ఫర్మ్ అయింది. 2027లో ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని టాక్. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ‘డ్రాగన్‘, అలాగే ప్రభాస్‌తో ‘సలార్ 2‘ సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది. మరోవైపు అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో కొత్త చిత్రాన్ని మొదలు పెట్టాడు.
మొత్తంగా.. ఇప్పటికే ‘కె.జి.యఫ్, సలార్’ వంటి మాస్ యాక్షన్ ఫిల్మ్స్‌తో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి ఎనర్జిటిక్ స్టార్‌తో కలిస్తే ఎలాంటి విజువల్ వండర్ రాబోతుందో అన్నదానిపై అభిమానుల్లో భారీ హైప్ నెలకొనడం కామన్. మరి.. ఈ క్రేజీ ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందో చూడాలి.
-
Home
-
Menu