అల్లరి నరేష్ కొత్త ప్రయోగం

అల్లరి నరేష్ కొత్త ప్రయోగం
X
కామెడీలో దుమ్మురేపే అల్లరి నరేష్, ఇటీవలి కాలంలో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ కొత్త దారిలో ప్రయాణం చేస్తున్నాడు. ఈకోవలోనే తాజాగా 'పొలిమేర' ఫ్రాంచైజీ మేకర్స్ ఆధ్వర్యంలో రూపొందుతున్న ‘12A రైల్వే కాలనీ’ అనే హార్రర్ థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు.

ఈ సినిమా టైటిల్ టీజర్ ఆసక్తికరంగా ఉంది. ఓ మిస్టరీ కథాంశంతో రాబోతున్న ఈ మూవీలో 'ఈ ఆత్మలు కొంతమందికే ఎందుకు కనిపిస్తాయి?' ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అల్లరి నరేష్ లుక్, టీజర్‌లో చూపించిన థ్రిల్ ఎలిమెంట్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.

ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Tags

Next Story