అక్కినేని కాంపౌండ్ లో అల్లరి నరేష్

అక్కినేని కాంపౌండ్ లో అల్లరి నరేష్
X
అల్లరి నరేష్ ఒకవైపు 'ఆల్కహాల్' సినిమాను విడుదలకు సిద్ధం చేస్తూనే, తన కెరీర్‌లో 65వ చిత్రాన్ని తాజాగా ప్రారంభించాడు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన పూజా కార్యక్రమంతో ఈ చిత్రం అఫీషియల్ గా లాంఛ్ అయింది.

ఈ కార్యక్రమానికి అక్కినేని నాగ చైతన్య ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టగా, దర్శకుడు బాబీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి షాట్‌కు వి.ఐ. ఆనంద్ గౌరవ దర్శకత్వం వహించారు. వశిష్ట, రామ్ అబ్బరాజు, విజయ్ కనకమేడల వంటి దర్శకులు స్క్రిప్ట్‌ను నిర్మాతలకు అందజేశారు.

చంద్రమోహన్ దర్శకత్వంలో, రాజేష్ దండ (హాస్య మూవీస్), ప్రసాద్ నిమ్మకాయల (అన్నపూర్ణ స్టూడియోస్) నిర్మాణంలో రాబోతున్న ఈ చిత్రం ఫాంటసీ–కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందట. అల్లరి నరేష్ ఈ చిత్రంలో సరికొత్త రోల్‌లో కనిపించనుండగా, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, నరేష్ వి.కె. వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి 'రంభ ఊర్వశి మేనక' అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

Tags

Next Story