సూర్య ఆశలన్నీ 'రొ్లెక్స్' పైనే!

సూర్య ఆశలన్నీ 'రొ్లెక్స్' పైనే!‘కంగువ’ భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ఘోరంగా ఫ్లాప్ అయిన తర్వాత, కోలీవుడ్ ప్రేక్షకులు అందరూ సూర్య మళ్లీ గాడిలో పడతాడని, 'రెట్రో' సినిమా ద్వారా ఒక మంచి థియేట్రికల్ హిట్ ఇస్తాడని ఆశించారు. అయితే, మే 1న థియేటర్లలో విడుదలైన 'రెట్రో' కూడా అదే కోవలో ఫ్లాప్ అయ్యింది.
సినిమా ఫస్ట్ హాఫ్ కు మంచి స్పందన వచ్చినా, సెకండ్ హాఫ్ చాలా డ్రాగీగా ఉందని, చాలా మంది ప్రేక్షకులు అసంతృప్తిగా స్పందించారు. ముఖ్యంగా కార్తీక్ సుబ్బరాజ్ తన పాత సినిమాల నుంచి కొన్ని సన్నివేశాలను మళ్లీ తీసుకున్నట్లు కనిపించిందని విమర్శలొచ్చాయి. ఈ కారణంగా ‘రెట్రో’క్రిటిక్స్ దగ్గరా, జనాల్లోనూ ఆశించినంత పాజిటివ్ టాక్ తెచ్చుకోలేకపోయింది.
తమిళనాట ఓ మోస్తరు ఓపెనింగ్ వచ్చినప్పటికీ, హిందీ, తెలుగు వర్షన్లలో మాత్రం డే 1 నుంచే దారుణంగా ఫ్లాప్ టాక్ వచ్చింది. తమిళనాడు లోనూ రెండో రోజు నుంచి ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.
అయితే, ఈ నెగటివ్ ఫలితాల మధ్య, ఒక చిన్న ఆశా కిరణం అభిమానుల్లో కనిపిస్తోంది. 'రెట్రో' సినిమా చూశాక చెన్నైలో జరిగిన ఓ మీడియా సమావేశంలో దర్శకుడు లోకేశ్ కనగరాజ్ మాట్లాడుతూ "రోలెక్స్ అనే సూర్య పాత్రతో ఓ స్టాండ్అలోన్ సినిమా ఖచ్చితంగా వస్తుంది" అని స్పష్టం చేశారు.
ఈ ప్రకటనతో కొన్ని సోషల్ మీడియాలో సూర్య అభిమానులు – “సూర్యను తిరిగి లైన్‌లోకి తేనివాడు లోకేశే” అంటూ కామెంట్లు చేస్తున్నారు. కానీ 'రోలెక్స్' సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? అది ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అవుతుంది? అనేది ఆసక్తి గా మారింది. ప్రస్తుతం, వరుస ఫ్లాప్‌ల మధ్య సూర్యకు మళ్లీ ఒక మెరుగైన బ్రేక్ ఇవ్వగల ప్రాజెక్ట్ అయితే, అది 'రోలెక్స్' సినిమా కావచ్చునని అభిమానులు భావిస్తున్నారు.
-
Home
-
Menu