'నా రికార్డులన్నీ ఒరిజినల్'.. ఫేక్ కలెక్షన్లపై బాలయ్య పంచ్!

X
'డాకు మహారాజ్'ఈవెంట్ లో ఫేక్ కలెక్షన్ల గురించి తనదైన శైలిలో స్పందించాడు బాలకృష్ణ. 'నా రికార్డులన్నీ ఒరిజినల్' అని బాలయ్య స్పష్టంగా పేర్కొన్నాడు.
ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టేటట్టు చెప్పడం బాలకృష్ణ స్టైల్. సంక్రాంతి రేసులో 'డాకు మహారాజ్' సినిమాతో ఘన విజయాన్ని అందుకున్నాడు బాలయ్య. ఈ సందర్భంగా అనంతపురంలో ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో బాలకృష్ణ తన ఎనర్జిటిక్ స్పీచ్‌తో అభిమానులను ఉత్సాహపరిచాడు. సినిమా విజయానికి తోడ్పడిన ప్రతిఒక్కరిని ప్రత్యేకంగా ప్రస్తావించాడు.
అలాగే ఈ ఈవెంట్ లో ఫేక్ కలెక్షన్ల గురించి తనదైన శైలిలో స్పందించాడు. 'నా రికార్డులన్నీ ఒరిజినల్' అని బాలయ్య స్పష్టంగా పేర్కొన్నాడు.ఈ వ్యాఖ్యలు ఫేక్ కలెక్షన్స్ వేస్తున్న వారికి బాలయ్య మార్క్ పంచ్‌గా పరిగణిస్తున్నారు ఫ్యాన్స్. 'డాకు మహారాజ్' తర్వాత 'అఖండ 2'తో బిజీగా ఉన్న బాలయ్య ఆ తర్వాత మలినేని గోపీచంద్ తో ఓ సినిమాని లైన్లో పెడుతున్నాడు. 'ఆదిత్య 369' సీక్వెల్ కూడా బాలయ్య కిట్టీలో ఉంది.
Next Story
-
Home
-
Menu