ప్రేమకోసం నిలబడే ‘లెనిన్‘

ప్రేమకోసం నిలబడే ‘లెనిన్‘
X
అక్కినేని అఖిల్ కొత్త సినిమాకి సంబంధించి అప్డేట్ వచ్చేసింది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ లపై నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అక్కినేని అఖిల్ కొత్త సినిమాకి సంబంధించి అప్డేట్ వచ్చేసింది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ లపై నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న అఖిల్ 6వ సినిమాకి ‘లెనిన్‘ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈరోజు అఖిల్ బర్త్ డే స్పెషల్ గా ‘లెనిన్‘ టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు.

ఆద్యంతం చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో రూరల్ యాక్షన్ లవ్ స్టోరీగా ఈ చిత్రం రాబోతున్నట్టు ఈ టైటిల్ టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఈ మూవీలో అఖిల్ కి జోడీగా శ్రీలీల నటిస్తుంది. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. మొత్తంగా అఖిల్ ఈసారి సరికొత్తగా వస్తున్నాడు. మరి.. ‘లెనిన్‘తో అక్కినేని వారబ్బాయి ఆశలు ఫలిస్తాయేమో చూడాలి.



Tags

Next Story