షూటింగ్ లో అజిత్ యాక్సిడెంట్ – ‘బిహైండ్ ది సీన్స్’ వీడియో వైరల్!

షూటింగ్ లో అజిత్ యాక్సిడెంట్ – ‘బిహైండ్ ది సీన్స్’ వీడియో వైరల్!
X
ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాలలో అజిత్ 'పట్టుదల' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రెండేళ్ల తర్వాత అజిత్ నుంచి వస్తోన్న మూవీ ఇది. 'తడమ్' వంటి సూపర్ హిట్ థ్రిల్లర్ అందించిన మగిళ్ తిరుమేణి ఈ చిత్రానికి దర్శకుడు. హెయిస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా 'పట్టుదల' సినిమా రూపొందింది.

ఆద్యంతం అజర్ బైజాన్ కంట్రీ బ్యాక్‌డ్రాప్ తో రూపొందిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ దక్కింది. లేటెస్ట్ గా ఈ మూవీ షూటింగ్ కి సంబంధించి బిహైండ్ సీన్స్ వీడియోని రిలీజ్ చేసింది టీమ్. ఎక్స్‌ట్రీమ్ వెదర్ కండిషన్స్ లో ఈ సినిమాని తెరకెక్కించింది టీమ్. అలాగే షూటింగ్ సమయంలో అజిత్ కి జరిగిన మేజర్ యాక్సిడెంట్ కి సంబంధించిన విజువల్స్ కూడీ ఈ బిహైండ్ ది సీన్స్ వీడియోలో ఉన్నాయి.

అజిత్ కి జోడీగా త్రిష నటించగా, ఇతర ప్రధాన పాత్రల్లో యాక్షన్ కింగ్ అర్జున్, రెజీనా కనిపించబోతున్నారు. అనిరుధ్ మ్యూజిక్, ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ ఈ మూవీకి టెక్నికల్ గా ఎంతో ప్లస్ అని భావిస్తోంది టీమ్.

Tags

Next Story