‘పట్టుదల‘ నుంచి అజిత్-త్రిష పార్టీ సాంగ్!

‘పట్టుదల‘ నుంచి అజిత్-త్రిష పార్టీ సాంగ్!
X
తమిళ అల్టిమేట్ స్టార్ అజిత్, అందాల నాయిక త్రిష జంటగా నటించిన చిత్రం ‘పట్టుదల‘. మగిళ్ తిరుమేణి తెరకెక్కించిన ఈ మూవీ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతుంది. ఫిబ్రవరి 6న తమిళంతో పాటు.. తెలుగులోనూ గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కు రెడీ అవుతుంది.

తమిళ అల్టిమేట్ స్టార్ అజిత్, అందాల నాయిక త్రిష జంటగా నటించిన చిత్రం ‘పట్టుదల‘. మగిళ్ తిరుమేణి తెరకెక్కించిన ఈ మూవీ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతుంది. ఫిబ్రవరి 6న తమిళంతో పాటు.. తెలుగులోనూ గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కు రెడీ అవుతుంది. లేటెస్ట్ గా ‘పట్టుదల‘ నుంచి ఓ ఫాస్ట్ బీట్ ట్రాక్ ను వదిలారు.


అనిరుధ్ రవిచందర్ సంగీతంలో శ్రీ సాయి కిరణ్ రాసిన ‘సవదీక‘ అంటూ సాగే ఈ సాంగ్ ను ఆంథోని దాసన్, అనిరుధ్ ఆలపించారు. అజిత్, త్రిష మధ్య చిత్రీకరించిన ఈ పాట పార్టీ మోడ్ లో ఆకట్టుకుంటుంది. అజిత్, త్రిష గతంలో నాలుగైదు సినిమాల్లో నటించారు. మళ్లీ కాస్త గ్యాప్ తర్వాత వీరిద్దరూ నటించిన సినిమా ‘పట్టుదల‘. ఈ మూవీలో అర్జున్, రెజీనా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.



Tags

Next Story