కాస్టింగ్ కౌచ్ నుంచి బయటపడిన నటి

కాస్టింగ్ కౌచ్ నుంచి బయటపడిన నటి
X
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సమస్య ఎప్పటి నుంచో ఉందని మనందరికీ తెలుసు. తాజాగా, నటి సయామీ ఖేర్ ఈ అంశంపై తన అనుభవాన్ని వెల్లడించి చర్చకు తెరలేపింది.

సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సమస్య ఎప్పటి నుంచో ఉందని మనందరికీ తెలుసు. తాజాగా, నటి సయామీ ఖేర్ ఈ అంశంపై తన అనుభవాన్ని వెల్లడించి చర్చకు తెరలేపింది. తన కెరీర్ ప్రారంభంలో ఒక తెలుగు మహిళా ఏజెంట్ తనకు సినిమా అవకాశాల కోసం 'సర్దుకుపోవాలని' సూచించిందని ఆమె చెప్పడం గమనార్హం.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కెరీర్ ఆరంభంలో ఎదురైన ఓ చేదు సంఘటన తనను చాలా బాధించిందని చెప్పింది సయామీ. 'ఒక మహిళా ఏజెంట్, అవకాశాల కోసం కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలని చెప్పడం నన్ను షాక్‌కు గురి చేసింది. ఆమె మాటలు వినగానే నేను ఏమిటో అర్థం కానట్లుగా నటించాను. కానీ ఆమె అదే మాటలు మళ్లీ మళ్లీ చెప్పడంతో, నన్ను ఆ మార్గంలోకి లాక్కెళ్లాలనుకుంటున్నారని గ్రహించి, తానెప్పటికీ అలాంటి పనులకు ఒప్పుకోనని స్పష్టం చేశాను' అని సయామీ పేర్కొంది.

ఇలాంటి ప్రతిపాదన ఓ మహిళ నుంచి రావడం తనకు తొలిసారి, చివరిసారి కూడా అని ఆమె స్పష్టం చేసింది. 2015లో తెలుగు సినిమా ‘రేయ్’తో తన ప్రయాణాన్ని ప్రారంభించిన సయామీ, అనంతరం బాలీవుడ్‌లో 'మిర్జియా, ఘూమర్, 8 AM మెట్రో' వంటి చిత్రాలతో పాటు వెబ్‌సిరీస్‌లలో కూడా నటించి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం హిందీ, తెలుగు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న సయామీ, ఈ ఏడాది 'జాట్' మూవీలో ఎస్.ఐ. విజయలక్ష్మి పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

Tags

Next Story