ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ‘ఆర్యన్’

కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’. ప్రవీణ్ కె దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విష్ణు విశాల్ పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. హత్యల సూత్రధారులను వెతికే ఇన్వెస్టిగేషన్ కథాంశంతో ఈ మూవీని మర్డర్ మిస్టరీగా తెరకెక్కించారు.
ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి, వాణి భోజన్ హీరోయిన్లుగా నటిస్తుండగా, సెల్వరాఘవన్, సాయి రోనక్, తారక్ పొన్నప్ప, మాల పార్వతి ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
గతంలో విష్ణు విశాల్ నటించిన 'రాట్ససన్' ఘన విజయాన్ని సాధించింది. అదే చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ 'రాక్షసుడు' పేరుతో రీమేక్ చేశాడు. 'ఆర్యన్' టీజర్ చూస్తుంటే విష్ణు విశాల్ మళ్లీ 'రాట్ససన్' వంటి విజయాన్ని అందుకుంటాడేమో అనే వైబ్స్ కనిపిస్తున్నాయి. డార్క్ అండ్ ఇంటెన్స్ విజువల్స్‌తో ఆసక్తిని రేకెత్తిస్తున్న ‘ఆర్యన్’ అక్టోబర్ 31న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలోకి రాబోతుంది.
-
Home
-
Menu