మేఘాలయ మర్డర్ కేసుతో అమీర్ సినిమా

మేఘాలయ మర్డర్ కేసుతో అమీర్ సినిమా
X
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మేఘాలయ హనీమూన్ హత్య కేసు ఇప్పుడు వెండితెరపైకి రాబోతుందట. బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్‌ తాజాగా ఈ కేసుపై ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం.

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మేఘాలయ హనీమూన్ హత్య కేసు ఇప్పుడు వెండితెరపైకి రాబోతుందట. బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్‌ తాజాగా ఈ కేసుపై ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించే మిస్టరీ, భావోద్వేగాలు, అనూహ్య ట్విస్టులతో నిండిన ఈ ఘటన కథాంశంగా సినిమాకి సరిపోతుందని అమీర్ భావిస్తున్నట్లు బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి.

రాజా రఘువంశీ అనే వ్యక్తి తన భార్య సోనమ్‌తో హనీమూన్‌కు వెళ్లగా, అక్కడ ఆయన అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. ఆయన మరణం విషయంలో ఆయన భార్య పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ మిస్టరీ నేపథ్యంలోనే అమీర్ స్క్రిప్ట్ వర్క్‌ను ప్రారంభించినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇప్పటికే ‘తలాష్’ వంటి సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న అమీర్, ఈసారి కూడా నిజ జీవిత ఘటన ఆధారంగా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తున్నాడట. ఇటీవల ‘సీతారే జమీన్ పర్’తో అమీర్ ఖాన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. మరి.. అమీర్ చేయబోయే ఈ క్రైమ్ థ్రిల్లర్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందేమో చూడాలి.

Tags

Next Story